మూడేళ్లుగా స్నానం కూడా చేయకుండా ఇంట్లోనే అన్నా, ఇద్దరు చెల్లెళ్లు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : అన్నా, ఇద్దరు చెల్లెళ్లు.. బయటి ప్రపంచాన్ని చూడటమే మరిచారు. రోజులో ఒక్కసారి అన్న మాత్రమే బయటకు వచ్చేవాడు. మళ్లీ లోనికి వెళ్తే.. ఇక అంతే.. రోజులు, నెలలు కాదు.. మూడేళ్లు ఇంటి నుంచి బయటకే రాలేదు. కనీసం స్నానం కూడా చేయకుండా ఉన్నారు. విషయం ఎలా బయట పడిందో తెలుసా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కేంద్రలోని ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తోంది. ఏమై ఉంటుందా.. అని పక్కింటి వారు వెళ్లి చూడగా షాక్ కు గురవడం వారి వంతయింది. స్నానం చేయకుండా, శుభ్రం పాటించక, మురికి బట్టలతో ముగ్గురూ భయానకంగా కనిపించారు.

మరో షాకైన విషయం ఏంటో తెలుసా.. ఆ ఇంటికి రెండేళ్లుగా విద్యుత్ సరఫరా లేనే లేదు. వారిలో అన్న మాత్రం రోజులో ఒకసారి బయటకు వచ్చి భోజనం, నీరు తీసుకెళ్లే వాడట. ఆయన ఇద్దరు చెల్లెళ్లు మూడేళ్లుగా గడప దాటి బయటకే రాలేదంటే నమ్మండి.

ఇరుగు పొరుగుకు తెలిసి ఊరంతా బట్టబయలైంది. అసలు ఎందుకిలా చేశారని అడిగితే వారిచ్చిన సమాధానం ఏంటో తెలుసా.. మూడేళ్ల క్రితం వారి తల్లి మరణించింది. ఆమె మృతితో షాక్ కు గురై దాన్నుంచి కోలుకోలేకే అలా ఉండిపోయామని బదులిచ్చారు.