హైదరాబాద్ నగరంలో మరో దారుణం

• మెట్రో స్టేషన్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం ఓ దారుణ ఘటన చోటుచేసుకొంది. మెట్రో రైల్వేస్టేషన్ పైనుంచి ప్రధాన రహదారి పైకి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకొంది.

అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. మెట్రో స్టేషన్ కు రైలు రాగానే ఆ యువతి కిందికి దూకింది. అనంతరం తీవ్రగాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

యువతి మెట్రో స్టేషన్ పైనుంచి జాలీ దాటి దూకేందుకు యత్నిస్తుండగా కింది నుంచి కొందరు కేకలు వేశారు. కొద్దిసేపు తర్జన భర్జన పడిన ఆ యువతి మెట్రో రైలు స్టేషన్ వద్దకు వచ్చి పక్క నుంచి వెళ్తుండగానే రోడ్డుపై దూకేసింది. ఈ విషయం అక్కడి సీసీ కెమెరాలో నమోదైంది.

హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ పరిధిలో శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.