సూర్యాపేట జిల్లా ఇన్ చార్జి ఎస్పీగా నాగేశ్వర్ రావు

సూర్యాపేట జిల్లా ఇన్ చార్జి ఎస్పీగా నాగేశ్వర్ రావు

రచ్చబండ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఇన్ చార్జి ఎస్పీగా మేక నాగేశ్వర్ రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్పీగా పని చేసిన రాజేంద్రప్రసాద్ ను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఈ మేరకు జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తున్న మేక నాగేశ్వర్ రావును జిల్లా ఇన్ చార్జి ఎస్పీగా నియమించింది.

గతంలో సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహించిన నాగేశ్వర్ రావు పోలీస్ శాఖలో సమర్థుడిగా పేరు పొందారు. పదోన్నతిపై సూర్యాపేట అదనపు ఎస్పీగా వచ్చారు. తోటి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలుపుగోలుగా ఉంటూ మంచి అధికారిగా గుర్తింపు పొందారు. బాధితుల సమస్యల పట్ల తక్షణమే స్పందిస్తూ పారదర్శకంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తూ, విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉత్తమ అధికారిగా అవార్డులు కూడా పొందారు. ఈ మేరకు ఇంచార్జి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సిబంది, అధికారులు శుభాకంక్షాలు తెలిపారు.