శంకర్ పల్లి పట్టణంలో పట్టపగలు చోరీ
* 22 తులాల బంగారం, రూ.లక్ష నగదు దోచుకున్న దుండగులు
రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో పట్టపగలు ఇంటి తలుపు తాళాలు పగలగొట్టి 22 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును దొంగలించిన సంఘటన గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరిగింది.
స్థానికంగా శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న వంశీధర్ రెడ్డి పని నిమిత్తం బయటకి ఇంటి తలుపునకు తాళం వేసి వెళ్ళగా గుర్తుతెలియని దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 22 తులాల బంగారం, లక్ష రూపాయలు నగదు అపహరించారు. పోలీసుల వైఫల్యం వల్లనే వరుస దొంగతనాలు శంకర్ పల్లి పట్టణంలో జరుగుతున్నాయని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు.
వరుసగా వారం రోజులలో పట్టణంలో మూడు దొంగతనాలు జరిగాయి. కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహించారు.