కొత్త మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేయూత

కొత్త మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేయూత
* చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి
* రూ.45 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్, పార్కు ప్రారంభం

రచ్చబండ, శంకర్ పల్లి: కొత్త మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో కృషి చేస్తున్నారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో శ్రీ వివేకానంద కాలనీ, రామకృష్ణ విద్యాలయ వద్ద స్థానిక మున్సిపాలిటీ కి చెందిన స్థలములో పట్టణ ప్రగతి పథకంలో రూ.45 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్, పార్కును చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్. విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. మున్సిపాలిటీలకు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ మురికి కాలువలు నిర్మాణాలు జరిగేలా చేస్తున్నారని చెప్పారు. వీటితోపాటు గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని తెలిపారు. నేడు ఏ గ్రామం చూసిన సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, పచ్చని చెట్లతో స్వాగతం పలుకుతున్నాయని చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మూడవసారి గెలుపొంది మళ్లీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, రైతుల రుణాలు మాఫీ చేస్తూ వారిని ఆదుకుంటున్నారని చెప్పారు. వీటితోపాటు శంకర్ పల్లి మండలం లోని పలు గ్రామాల రాకపోకల గురించి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి మూసీ నదిపై బ్రిడ్జి పనులను జరిగేలా చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ ఎం. పాపారావు, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కే గోపాల్, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ జ్ఞానేశ్వర్, వార్డు సభ్యులు బి. అశోక్ కుమార్, జూలకంటి శ్వేత పాండురంగారెడ్డి, ఎం. చంద్రమౌళి, చాకలి అశోక్, కో ఆప్షన్ సభ్యులు బి. వెంకట్ రెడ్డి, రజిని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బి. అశోక్ కుమార్, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, పార్శి బాలకృష్ణ, జూలకంటి రామ్ రెడ్డి, సంజీవరెడ్డి, విజయ్, భాస్కర్, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.