కొండకల్ లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

కొండకల్ లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

రచ్చబండ, శంకర్ పల్లి; రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామ శివారులో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 100 ఎకరాల స్థలము లో మేధా కంపెనీ 800 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మించడం సంతోషకరమన్నారు.

దీంతో వేల మందికి ఈ ఫ్యాక్టరీలో ఉపాధి లభిస్తుందని తెలిపారు. రియల్ సింగిల్ విండో విధానంతో లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలిపారు మేధా ఫ్యామిలీ సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విడివిడి భాగాలను ఎంత స్కేల్ తో చేస్తున్నారో కశ్యప్ రెడ్డి స్వయంగా తెలిపారు అన్నారు. తెలంగాణ బిడ్డలే ఈరోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లను తయారు చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాదులో ఫార్మా, పౌల్ట్రీ ఇండస్ట్రీలు బాగా పెరిగాయి అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా టీపాస్, ఐ పాసులను తీసుకువచ్చామన్నారు.

ప్రపంచంలో భారతదేశంలో పాటు చాలా చోట్ల సింగిల్ విండోలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ శాంతి కుమారి, ఎంపీలు రంజిత్ రెడ్డి, మెదక్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, బల్కా సుమన్, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, శంబిపూర్ రాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు తీగల అనిత రెడ్డి, శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.