కంటి వెలుగు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
* 14వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి; రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శంకర్ పల్లి మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ శ్వేత పాండురంగారెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డులు నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారి కోసం ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో కొనసాగిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలు ఈ కంటి వెలుగు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరాలలో మందులు, కంటి అద్దాలను ఉచితంగా అందిస్తారని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ యూత్ అధ్యక్షుడు జూలకంటి పాండురంగారెడ్డి వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.