కొండకల్ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ వితరణ

కొండకల్ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ వితరణ

* ఇల్లు కాలిన బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో నివసిస్తున్న పులిమామిడి పద్మ ఇల్లు శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. దీంతో ఆమె ఇంట్లో ఉన్న లక్ష రూపాయల విలువైన సామాగ్రి బూడిదయింది.

కాగా కొండకల్ గ్రామ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి, రూ.10,000, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, రూ.2,000 పద్మకు ఆర్థిక సహాయం శనివారం ఆమె ఇంటి వద్దకు వెళ్లి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంటరి మహిళ అయిన పద్మ గ్రామంలో కుట్టు మిషన్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నదని తెలిపారు.

అనుకోకుండా శుక్రవారం రాత్రి కరెంటు షార్ట్ సర్క్యూట్తో ఇల్లు కాలిపోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రవి నాయక్, నాయకులు కైలాస్, రాజు, జి. వీరయ్య, టి.సత్యం, రామచందర్, కె. లక్ష్మారెడ్డి, మహిపాల్, జి. కాంతం, శ్రీను, నవాబ్ రెడ్డి, బుచ్చి రాములు పాల్గొన్నారు.