Thaher Ali.. ఉత్తమ ఉపాధ్యయ అవార్డుతో పెరిగిన బాధ్యతలు

  • జిల్లా ఉత్తమ అవార్డ్ గ్రహీత ఎండీ తాహేర్ అలీ

రచ్చబండ, శంకర్ పల్లి : ఉత్తమ ఉపాధ్యయ అవార్డు తనకు మరింతగా బాధ్యతలను పెంచిందని జిల్లా ఉత్తమ అవార్డ్ గ్రహీత ఎండీ తాహేర్ అలీ తెలిపారు.  మాహరాజ్ పేట్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎండీ తాహేర్ అలీ సెప్టెంబర్ 5న జిల్లా ఉత్తమ అవార్డ్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల శాసన సభ సభ్యులు కాలే  యాదయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ హరీష్, రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశింధర్ రావు చేతుల మీదుగా జిల్లా ఉత్తమ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉత్తమ అవార్డు పొందినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డును అందుకుందందున ఇంకా బాధ్యతలు పెరిగాయన్నారు. ఇష్టంతో కష్టపడి విద్యార్థులకు నిరంతర విద్యార్థిగా మంచి బోధనను అందిస్తానని ప్రమాణం చేశారు. ఉత్తమ అవార్డు లను పొందిన వారిలో తాహెర్ అలీతో పాటు మండలంలో నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.

శంకర్ పల్లి మండలంలోని మహారాజ్ పేట్ ప్రాథమిక,  రేసు సత్రిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికీ గ్రామ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బద్రి శ్రీకాంత్ గ్రామస్తులు కృష్ణరామ్ చందర్, ఉపాధ్యాయులు సరిత, సుమతి, రాజేందర్ రెడ్డి, కృష్ణ, అశోక్, రియాజ్ అంగన్వాడి హెల్పర్ కుసుమలత, వివి జ్యోతి హెల్త్ సెంటర్ కు చెందిన పలువురు పాల్గొన్నారు.