సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి

సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
* తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం

రచ్చబండ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల్ కేంద్రంలో శుక్రవారం పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా భోజన విరమణ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

పాత పెన్షన్ విధానం లేకపోవడం వలన ఉద్యోగ ఉపాధ్యాయులు మానసిక క్షోభకు గురి అవుతున్నారని తెలిపారు. అనేక పర్యాయాలు సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్న నిరసనలు ఉద్యమాలు చేసిన ఫలితం లేకుండా పోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల సానుకూలతతో సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

కాగా ఈ మేరకు డిప్యూటీ తాసిల్దారు ప్రియాంక అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, శ్రీను, నవనీత., రంగారెడ్డి, కృష్ణయ్య జంగయ్య,మల్లేశం,విజయలక్ష్మి పాల్గొన్నారు.

టియుటిఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత
శుక్రవారం టియుటిఎఫ్ నాయకులు కూడా సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక డిప్యూటీ తహసిల్దార్ ప్రియాంకకు వినతిపత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో టియుటిఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్, శ్రీనివాసచారి, గౌరవ అధ్యక్షులు బి. దేవేందర్ రెడ్డి, అధ్యక్షులు. పి నరేందర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి ఎం. వెంకటేశ్వరరావు, కార్యదర్శులు జగదీశ్వర్, వరప్రసాద్, మోహన్ రెడ్డి, రాము శర్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.