సబ్సిడీ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరగాలి

సబ్సిడీ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరగాలి

* శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వం సబ్సిడీలపై ఇచ్చే గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరిగేలా చూడాలని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య సూచించారు. గురువారం శంకర్ పల్లి మండలంలోని మోకిలా తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్యాస్ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా జరగాలని తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ రోడ్డు ప్రక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ట్రాక్టర్లలో తరలించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఇబ్బంది పాల్గొన్నారు.