శేరిగూడలో 90 శాతం వరకు అభివృద్ధి పనులు పూర్తి
* సర్పంచ్ సత్యనారాయణ వెల్లడి
రచ్చబండ శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలం శేరిగూడ గ్రామంలో 90 శాతం వరకు అభివృద్ధి పనులు పూర్తి చేశామని మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, శేరిగూడ సర్పంచ్ ఎం. సత్యనారాయణ అన్నారు. గురువారం గ్రామంలో వేస్తున్న సిసి రోడ్డు పనులను ఉపసర్పంచ్ ఇంద్రసేనారెడ్డి తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సహాయ సహకారాలతో గ్రామంలో అండర్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్లు వేశామని తెలిపారు. సుమారు 25 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించామని చెప్పారు.
గ్రామంలో మిగిలిన పనులను వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.