BJP Leader Thonda Ravi.. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేవరకు బీజేపీ పోరాటం

BJP Leader Thonda Ravi.. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేవరకు బీజేపీ పోరాటం
* రంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి తొండ రవి

రచ్చబండ శంకర్ పల్లి: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్ రూములు ఇచ్చేవరకు శంకర్ పల్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జరుగుతాయని రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కొండ రవి తెలిపారు. గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండల బిజెపి నాయకులతో కలసి మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక ఇండ్లు లేని వారికి కేటాయించకుండా నగరానికి చెందిన యాకుత్ పుర, కార్వాన్ ప్రాంతాలలో నివసించే ప్రజలకు కేటాయించారని తెలిపారు. 60 కిలోమీటర్ల దూరంలో నగరవాసులకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తే వారు ఇబ్బందుల పాలవుతారని చెప్పారు. అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తమ వ్యాపారాలు ముగించుకొని ఇక్కడికి ఎలా చేరుకుంటారని ప్రశ్నించారు.

1512 డబుల్ బెడ్ రూమ్ లో శంకర్ పల్లిలో నిర్మించారని, అందులో చేవెళ్ల నియోజకవర్గానికి 151 డబుల్ బెడ్ రూమ్ లో కేటాయించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. డబుల్ బెడ్ రూంలో విషయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విఫలమయ్యారని తెలిపారు. నియోజకవర్గంలోని ఇండ్లు లేని వారి జాబితాను తయారుచేసి వారికి డబుల్ బెడ్ రూములు కట్టించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానికులకు ఇండ్లను కేటాయించాలని, పేదలకు ఇండ్లు వచ్చేవరకు ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ కొలను ప్రతాపరెడ్డి, మండల మాజీ బిజెపి అధ్యక్షులు ఏనుగు నరసింహారెడ్డి, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి రాజేందర్ సింగ్, మున్సిపల్ బిజెపి అధ్యక్షులు బీర్ల సురేష్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.