శంకర్ పల్లి లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి లో శనివారం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినోత్సవాన్ని బిఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కావాలి గోపాల్, శంకర్ పల్లి ఏఎంసీ చైర్మన్ పాపారావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రమౌళి, జూలకంటి లక్ష్మమ్మ రామిరెడ్డి, సిహెచ్. గండేటి శ్రీనాథ్ గౌడ్, గోపాల్, కొత్తపల్లి ఎంపీటీసీ శోభా సుధాకర్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, మండల మైనారిటీ అధ్యక్షుడు ఫరీద్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ రఘునాథన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, నాయకులు దండు రామ్మోహన్, చందు గౌడ్, సయ్యద్ సలీం, రాజేశ్వర్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.