పెళ్లి చేసుకున్నాక భార్యను చదివించాడు.. ఉద్యోగం రాగానే ఏంజెసిందో తెలుసా?

పెళ్లి చేసుకున్నాక భార్యను చదివించాడు.. ఉద్యోగం రాగానే ఏంజెసిందో తెలుసా?

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి: పెళ్లి అయ్యాక తన భార్యకు చదువుపై ఉన్న మక్కువను గుర్తించాడు. ఎలాగైనా చదివించాలని అనుకున్నాడు. తాను కష్టపడ్డాడు. తన భార్యను ఎలాంటి కష్టం లేకుండా చదివించాడు. ఆ తర్వాత ఆమె చేసిన పనికి అతని  జీవితమే తలకిందులయ్యింది. ఏంటి ఆ విశేషాలు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కు చెందిన అర్జున్ అదే ప్రాంతానికి చెడిన సవిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయిన కొన్ని రోజులకే నర్సింగ్ చేయాలనే కోరికను ఆమె తన భర్తకు తెలిపింది. కష్టపడి బతికే తన కుటుంబంలో తన భార్య ఉద్యోగం చేస్తే బాగుపడతామని అర్జున్ అనుకున్నాడు. తన భార్య కోరికను కాదనకుండా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాడు. తాను రెక్కల కష్టం చేసి అయినా తన భార్యను చదివించాలని నిశ్చయించుకున్నాడు.

ఇంకేముంది.. తన భార్య సవితకు ఇష్టమైన నర్సింగ్ కోర్స్ లో అర్జున్‌ చేర్పించాడు. మూడేండ్లపాటు రెక్కలు ముక్కలు చేసికొని తన భార్య భవితవ్యం, తన కుటుంబ భవిష్యత్తు గురించే కలలు కంటూ అర్జున్ ముందుకు సాగాడు. ఎలాంటి పనులు చేయనివ్వకుండా చదువే లోకంగా ఉండేలా ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. కనీసం ఇంటి పనులు కూడా చేయనివ్వలేదు. చదువుకు ఏమి కావాలన్నా సమకూర్చాడు. ఎంత కావాలన్నా ఇస్తూ వచ్చాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతని మురిపాన్ని కాదనలేక పోయారు.

ఎట్టకేలకు అర్జున్ కష్టానికి ప్రతిఫలం దక్కింది. సవిత నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. ఆమె చదువుకు తగ్గట్టుగా ఇటీవలే ఓ ప్రభుత్వ దవఖానలో సర్కారు ఉద్యోగం వచ్చింది. ఈ సమయంలో అర్జున్ ఆనందానికి అవధులే లేవు. సంతోష పడ్డాడు. సంబురాలు చేసుకున్నాడు. వూరంతా చెప్పి ఆనందపడ్డాడు. తన కష్టాలు తీరాయని అందరితో చెప్పుకొని సంతృప్తి చెందాడు. ఇప్పడిదాక తాను కస్టపడ్డానని, ఇక నుంచి తన భార్య తనను చూసుకుంటుందని ముచ్చటపడ్డాడు. కానీ ఇంతలోనే అర్జున్ కు ఉలిక్కిపడే వార్త వినాల్సి వచ్చింది.

భర్త రెక్కల కష్టంతో ఉద్యోగంతో స్టేటస్ పొందిన సవిత ప్రవర్థనలో మార్పు రాసాగింది. అర్జున్ ను నిర్లక్షం చెయ్యసాగింది. సరిగా పట్టించుకునేది కాదు. పొడి పొడి మాటలతో చులకనగా చూడసాగింది. అసలు ఎందుకిలా చేస్తున్నావంటూ అర్జున్ నిలదీశాడు. ఆమె చెప్పిన సమాధానం విని హతాశుడయ్యాడు. అగాధంలోకి నెట్టివేసినంత పనయింది. భార్యకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఆవిరైంది. నల్లగా ఉన్నావు. తన స్టేటస్ కు పనికి రావు.. అంటూ అవమానించింది. అర్జున్ ను  వదిలి వేరే ఉండసాగింది. ఎటూ పాలుపోక చేసేదేమీ లేక తనకు న్యాయం చేయాలని అర్జున్‌ అధికారులను ఆశ్రయించాడు.