శంకర్ పల్లి మండలం, మున్సిపాలిటీ లలో భక్తిశ్రద్ధలతో దసరా పండుగ.

శంకర్ పల్లి మండలం, మున్సిపాలిటీ లలో భక్తిశ్రద్ధలతో దసరా పండుగ.

శంకర్ పల్లి ఏఎంసి యార్డులో రావణాసురుని ప్రతిభ దగ్ధం.

హాజరైన వేలాది భక్తులు.

నిఘా. శంకర్ పల్లి; శంకర్ పల్లి మండలం లోని గ్రామాలలో, మున్సిపాలిటీ ప్రాంతాలలో సోమవారం దసరా పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రావణాసురుని ప్రతి మను సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దహనం చేశారు.

ఈ కార్యక్రమానికి శంకర్ పల్లి పట్టణంలోని వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని రామకృష్ణ విద్యాలయం వద్ద, బుడిగ జంగాల కాలనీలో కూడా రావణాసురుని ప్రతిభను భక్తులు దానం చేశారు. ఈ కార్యక్రమాలలో రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా మంగళవారం మండలంలోని మిర్జాగూడ గ్రామంలో తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న దుర్గాభవాని విగ్రహాన్ని గ్రామ ఉపసర్పంచ్ శాంతి కిషన్ సింగ్ ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, స్థానిక ఏఎంసి మాజీ చైర్మన్ ఒగ్గు మల్లేష్, వార్డు సభ్యులు రాజు గౌడ్, నరేష్ సింగ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. దుర్గా భవాని ఉత్సవ ఊరేగింపులో మహారాష్ట్ర ప్రాంత హిందూ గర్జన ప్రతిష్టాను వారి డోలు వాయిద్యాలు భక్తులకు ఎంతో అలరించాయి.