శంకర్ పల్లి మండలంలో ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

శంకర్ పల్లి మండలంలో ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

రచ్చబండ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల గ్రామాలలో, మున్సిపల్ పరిధిలోని కాలనీలలో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తహసిల్దార్ కార్యాలయం ఎదుట తహసిల్దార్ సురేందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు.

శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద చైర్మన్ మారేపల్లి పాపారావు జెండాను ఎగురవేశారు. స్థానిక పిఎసిఎస్ కార్యాలయం పై చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి త్రివర్ణ ప్రతాకాన్ని ఎగురవేశారు. పోలీస్ స్టేషన్ వద్ద సిఐ వినాయక రెడ్డి త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రిజిస్టర్ సిరాజ్ అహ్మద్ జాతీయ జెండాను ఎగురవేశారు. మండలంలోని మోకిలా, మిర్జాగూడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఇంద్రారెడ్డి నగర్ కాలనీలోని పల్లె ప్రకృతి వనంలో నా మట్టి నాదేశం సందర్భంగా శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్ మొక్కలను నాటారు.

జనవాడ గ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గ్రామ వార్డు సభ్యుడు గౌడి చర్ల వెంకటేష్ గానం చేసిన దేశభక్తి గీతాన్ని మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాతా ప్రవీణ్ కుమార్, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు నాయక్, మోకిలా పిఎసిఎస్ చైర్మన్ గోపాల్, సర్పంచ్ సుమిత్ర మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సరిత రాజు నాయక్, గోపాల్ రెడ్డి, మిర్జాగూడ ఉప సర్పంచ్ శాంతి కిషన్ సింగ్, జనవాడ, మిర్జాగూడ వార్డు సభ్యులు, శంకర్ పల్లి మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.