దేశ దాస్య విముక్తికి ఎందరో మహానుభావుల త్యాగాలు

దేశ దాస్య విముక్తికి ఎందరో మహానుభావుల త్యాగాలు
* మహారాజ్ పేట్ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి
* స్వాతంత్ర సమరయోధుడు తొండ షేకయ్యకు సన్మానం

రచ్చబండ, శంకర్ పల్లి : భారతదేశ దాస్య విముక్తికి ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారని శంకర్ పల్లి మండలం మహారాజ్ పేట్ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి అన్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని గోపులారం గ్రామానికి చెందిన స్వాతంత్ర సమర యోధులు తొండ షేకయ్యకు (90) శాలువాతో సత్కరించి సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని గ్రామాలలో కూడా స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు ఉన్నారని అందులో గోపులారం గ్రామానికి చెందిన తొండ శేఖయ్య కూడా ఉన్నారన్నారు. స్వాతంత్రం సమరంలో ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్రం సాధించిన యోధులకు మనం ఎన్ని సన్మానాలు చేసిన తక్కువే అన్నారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం బిజెపి నాయకులు తొండ రవి, శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాహెర్ అలీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.