శంకర్ పల్లిలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు

శంకర్ పల్లిలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలలో శుక్రవారం శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుండి మహిళలు తల స్నానాలు చేసి కొత్త బట్టలను కట్టుకొని ఇండ్లలో ప్రత్యేక పూజలు చేశారు. వరలక్ష్మి వ్రత పూజలకు వచ్చిన మహిళలకు ప్రత్యేక వాయినాలు అందించారు.