శంకర్ పల్లిలో భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ
* పోచమ్మ తల్లికి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో ఆదివారం బోనాల పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలకు జరుపుకున్నారు. ఉదయం నుండి పోచమ్మ దేవాలయానికి భక్తులు బారులు తీరారు. మహిళలు బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ అధికారులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. స్థానిక పోలీసులు ఎలాంటి జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు పోచమ్మ దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు.