శంకర్ పల్లిలో ఆధునిక ఆసుపత్రి ఏర్పాటు హర్షణీయం

శంకర్ పల్లిలో ఆధునిక ఆసుపత్రి ఏర్పాటు హర్షణీయం

* రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: దినదినాభివృద్ధి చెందుతున్న శంకర్ పల్లి పట్టణంలో అన్ని వసుతులతో కూడిన నూతన ఆస్పత్రులు నిర్మించడం అభినందనీయమని రాష్ట్ర భూగర్భ జనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.

ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలోని చేవెళ్ల రోడ్డు, ఫతేపురం, హెచ్ పి పెట్రోల్ పంపు ప్రక్కన నిర్మించిన నూతన విజయ హాస్పిటల్ ను చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శంకర్ పల్లి పట్టణం త్వరగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.

శంకర్ పల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ మున్సిపాలిటీగా మార్చి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఏఎంసి చైర్మన్ డి. వెంకట్ రెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ డి. సంజీవరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గండేటి శ్రీనాథ్ గౌడ్, శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.