రాజునాయక్ ఇంటిలో శుభకార్యంలో మంత్రి మహేందర్ రెడ్డి

రాజునాయక్ ఇంటిలో శుభకార్యంలో మంత్రి మహేందర్ రెడ్డి
* ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య హాజరు

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా గ్రామ శివారులో శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సభావత్ రాజు నాయక్ నూతన గృహప్రవేశం సందర్భంగా ఆదివారం గృహములో జరిగిన శ్రీ సత్యనారాయణ వ్రతానికి రాష్ట్ర భూగర్భ జనుల శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో గుడిమల్కాపురం మాజీ ఏఎంసీ చైర్మన్ డి. వెంకట్ రెడ్డి, శంకర్ పల్లి ఎంపీపీ డి. గోవర్ధన్ రెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.