విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
* విద్య శాఖ మంత్రి పిఆర్ఓ, సీనియర్ జర్నలిస్ట్ ఎండి సలీం పాషా

రచ్చబండ, శంకర్ పల్లి: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిఆర్ఓ, సీనియర్ జర్నలిస్ట్ ఎండి సలీం పాషా అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.

శంకర్ పల్లి పట్టణంలో దశాబ్దాల కాలంగా పేద, మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు. పట్టణంలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా ఎంతోమంది విద్య కుసుమాలను అందించిన విద్యాలయంగా సలీం పాషా అభివర్ణించారు. ప్రపంచాన్ని ఒక కు గ్రామంగా మార్చివేసిన ఐటి నేడు ప్రతి పాఠశాలలో ఇస్తుందన్నారు. కంప్యూటర్ ల్యాబ్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఇందులో అయినా మంచిని గ్రహించి, చెడును చేరనీయ వద్దని, సెల్ ఫోన్లతో కాకుండా పాఠ్యపుస్తకాలతో విద్యార్థులు పోటీ పడాలన్నారు. 10 తర్వాత తమకు ఇష్టమైన రంగాన్ని పెంచుకొని ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అమ్మాయిల విద్యను ప్రోత్సహిస్తున్నారని, మహిళ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో చిన్నతనంలో వివాహాలు ఆగిపోయాయని, ఉన్నత విద్యలో అమ్మాయిల శాతం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.

విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో ఇటీవలే జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ, వై జ మెన్ క్లబ్లో సెంట్రల్ ఇండియా రీ జన్ జాయింట్ ట్రెజరర్ గా ఎంపికైనందుకు పాఠశాల కరస్పాండెంట్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ స్వర్ణలత, మాజీ వార్డు సభ్యులు ప్రణీత్ కుమార్( చిన్న) సలీం పాషా కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు ఆనంద్, ఇందిరా, అర్చన, శశికళ, స్రవంతి విద్యార్థులు పాల్గొన్నారు.