విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి

విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి

* బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు, న్యాయవాది కోమటిరెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి

 

రచ్చబండ, శంకర్ పల్లి: విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించుకోవాలని బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు, న్యాయవాది కోమటిరెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం శంకర్ పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్, తదితర పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవ తరగతిలో విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తీర్ణులు కావాలని కోరారు. ఈసారి పదవ తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువులకు అయ్యే ఖర్చును తాను స్వయంగా భరిస్తానని హామీ ఇచ్చారు.

భవిష్యత్తు పదవ తరగతి పైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నరహరి, ఎంపీటీసీ యాదగిరి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.