విద్యార్థులకు 2.50 లక్షల విలువైన వాస్తు సామగ్రి అందజేత

విద్యార్థులకు 2.50 లక్షల విలువైన వాస్తు సామగ్రి అందజేత6
* రేసు సత్తిరెడ్డి తనయుల వితరణ
రచ్చబండ, శంకర్ పల్లి :
స్వాతంత్ర్య దినోత్సవము సందర్బంగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిషత్ ప్రాథమిక, రేసు సత్తిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత మహారాజ్ రేట్ పాఠశాలలో చదువుకుంటున్న 250 మంది విద్యార్థులకు రేసు సత్తిరెడ్డి తనయులు రూ.2,50,000 విలువ గల రేసు మహేందర్ రెడ్డి హైకోర్ట్ సీనియర్ న్యాయవాదులు, రేసు రాజేందర్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ భద్రి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు నోట్ బుక్స్, రాత పుస్తకాలు, ప్యాడ్స్, వివిధ రకాల విద్యకు చెందిన వస్తు సామాగ్రి అందజేశారు.

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు గ్రామ సర్పంచ్ దోసాడా నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ అందించడం చాలా మంచి పరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జీవన జ్యోతి, తాహేర్, వార్డు సభ్యుడు గడ్డం రవీందర్, మాజీ ఉపసర్పంచ్ తొండ రవి, సంతోష్, కృష్ణ, ఉపాధ్యాయులు సరిత, సంగీత, పుష్పాలత, సుమతి, అశోక్, బాలరాజ్, రాజేందర్ రెడ్డి, అనసూయ, రవీందర్ రెడ్డి, కృష్ణ, రియాజ్, జ్యోతి మరియు విద్యార్థులు ఉన్నారు.