వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య

రచ్చబండ, శంకర్ పల్లి; ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య సూచించారు. శుక్రవారం మండలంలోని పొద్దుటూరు, పిల్లిగుండ్ల, మోకిలా గ్రామాలలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. మురికి కాలువలను జెసిబి లతో శుభ్రం చేయించారు. రోడ్ల ప్రక్కన పెరిగిన గడ్డి తదితర చెట్లను తొలగించారు.

గ్రామాల నుండి నీరు సక్రమంగా వెళ్లేటట్లు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఇక రెండు రోజులు వర్షాలు కురుస్తాయని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాత ఇండ్లలో ఉంటున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు పొలాల వద్ద కరెంట్ తీగలు, స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గీత, ఏపీవో నాగభూషణం, పిల్లిగుండ్ల సర్పంచ్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

25న మండల సర్వసభ్య సమావేశం
ఈనెల 25వ తేదీన శంకర్ పల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సకాలంలో పాల్గొని సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.