ర్యాలీకి తరలివెళ్లిన శంకర్ పల్లి బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు

రచ్చబండ, శంకర్ పల్లి: బుద్ధ భగవానుని 26 67వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శుక్రవారం 200 కార్ల శాంతి మహా ర్యాలీలో శంకర్ పల్లి బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా శంకర్ పల్లి శాఖ సభ్యులు బయలుదేరారు.

ఈ సందర్భంగా బిఎస్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ మర్పల్లి అశోక్ మాట్లాడుతూ మనం సంతోషంగా ఉండాలంటే కోరికలను తగ్గించుకొని , అసూయ ద్వేషాలను విడనాడి ఇతరుల పట్ల ప్రేమతో, దయతో, జాలి కరుణతో ఉన్నట్లయితే అంతులేని ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతామని అన్నారు.

బుద్ధ భగవానుడు ఎల్లప్పుడు శాంతిని కోరేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములు, నాగభూషణం, రవీందర్, రాజు, లింగం, వికాస్, చైతన్య, సురేష్, అర్చన, బాలామణి, పుష్పలత, విజయ, లక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. కాగా కార్ల ర్యాలీ హైదరాబాద్ నుండి నాగార్జునసాగర్ వరకు కొనసాగిందని తెలిపారు.