రైతుల కష్టాలు ఆయనకే బాగా తెలుసు!
రచ్చబండ, శంకర్ పల్లి : తెలంగాణ రైతన్నలకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు అంటూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంకర్ పల్లి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మండల బిఆర్ఎస్ నేతలు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక లాంటివారని అన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకొని 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు అందిస్తున్నారని తెలిపారు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతులను పట్టించుకోవడంలేదని అన్నారు. రైతులు పండించే పంటలకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ ఇస్తే రైతు బాగుపడతాడా అని అన్నారు. రైతులు అన్ని విషయాలను గమనిస్తున్నారని సరైన సమయానికి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. వరి ధాన్యం కొంటె రాజకీయం, ఆ ధాన్యం వర్షానికి తడిస్తే రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అని నినదిస్తూ రైతుల తరపున పోరాటం చేస్తున్న ఏకైక నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
రైతులను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని తెలిపారు. రైతులంతా సీఎంకు అండగా ఉన్నారని చెప్పారు. రైతు వ్యతిరేకుల మాటలు పట్టించుకోరని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, వైస్ చైర్మన్ కురుమ వెంకటేశం, మండల, మునిసిపాలిటీ బి ఆర్ ఎస్ అధ్యక్షులు కె. గోపాల్, వాసుదేవ్ కన్నా, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, కౌన్సిలర్లు శ్రీనాథ్ గౌడ్, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, పరివేద ఎంపిటిసి వెంకట్ రెడ్డి, పొద్దుటూరు మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకటరెడ్డి, శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు విజయ్ కుమార్, నాయకులు బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.