రూ.50 వేలు, ఆపై విరాళ దాతలు సంప్రదించాలి

రూ.50 వేలు, ఆపై విరాళ దాతలు సంప్రదించాలి
* శంకర్ పల్లి అయ్యప్ప సేవా సమితి సభ్యులు

రచ్చబండ, శంకర్ పల్లి: ఇటీవల శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప దేవాలయానికి విరాళాలు అందించిన దాతల పేర్లను శిలాఫలకాలపై ముద్రించడం జరుగుతుందని శ్రీ అయ్యప్ప సేవా సమితి సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రూ.50 వేలు, ఆపై చిలుకు ఇచ్చిన వారి పేర్లను తమ వద్ద ఉన్న జాబితా ప్రకారం పలకలపై ముద్రించి దేవస్థానంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రూ.50,000 పైచిలుకు అందించిన దాతలు ఏడు రోజుల్లో ఫోన్ నెంబర్.9440017595 ఫోన్ చేసి తాను ఇచ్చిన విరాళాలను నిర్ధారించుకోవాలని వారు ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా స్థల, ధన, వస్తు రూపేనా అందించిన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.