రంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు హర్షణీయం

రంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు హర్షణీయం
* శంకర్ పల్లి ఏఎంసీ చైర్మన్ మారేపల్లి పాపారావు
రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం చాలా హర్షణీయమని శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు అన్నారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెడికల్ కాలేజీలు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం ఆనందకరమన్నారు. ప్రతి రంగంలో రాష్ట్రం ముందడుగు వేస్తున్నదని చైర్మన్ అన్నారు. అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన అన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజ్ రావడానికి కృషి చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి కి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.