యువతిని వేధించిన కేసులో వ్యక్తికి మూడేండ్ల జైలు

యువతిని వేధించిన కేసులో వ్యక్తికి మూడేండ్ల జైలు
* 10 వేల జరిమానా.. చేవెళ్ల ఏఎస్జె కోర్టు తీర్పు

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో ఓ యువతిని వేధించిన కేసులో ముద్దాయికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా విధిస్తూ చేవెళ్ల ఏఎస్జె కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2019లో శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన గున్నాల శ్రీరామ్ రెడ్డి(25)కి చేవెళ్లలోని ఏఎస్జె కోర్టు మెజిస్ట్రేట్ ముద్దాయికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించినట్లు తెలిపారు. శంకర్ పల్లిలో ఓ అమ్మాయిని వేధించిన కేసులో ఈ శిక్ష పడిందని చెప్పారు.

అప్పుడు శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై లక్ష్మీనారాయణ విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో శిక్షపడేలా సరైన సాక్షాధారాలు సమర్పించిన లక్ష్మీనారాయణకు, కోర్టు కానిస్టేబుళ్లను రాజేంద్రనగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్, నార్సింగి ఏసిపి రమణ గౌడ్, శంకర్ పల్లి సిఐ జి.వినాయక రెడ్డి అభినందించారు.