మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలి

మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలి
* సీపీఐ నాయకుల డిమాండ్
* శంకర్ పల్లిలో దిష్టిబొమ్మ దహనం
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్పల్లి మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో మణిపూర్ సంఘటనకు నిరసనగా దోషులను కఠినంగా శిక్షించాలని అందుకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మణిపూర్ ప్రభుత్వంలోని ముఖ్య మంత్రి తక్షణమే భర్తల చేయాలని శంకర్పల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో సిపిఐ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుధీర్ అధ్యక్షతన నిరసన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా చేవెళ్ల నియోజవర్గం సిపిఐ కన్వీనర్ కే రామస్వామి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయని మణిపూర్ సంఘటన మాయని మచ్చని భరతమాత తలవంచుకునే సమయం ఆసన్నమైందని సంఘటనకు బాధ్యులైన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు గత రెండు నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలకు చూస్తూ కూర్చున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మహిళలపై దాడులు చర్చిలపై దాడులు ఇద్దరు మహిళలపై మానభంగాలు చేసి చంపివేశాలని ఇలాంటి అటవీక రాజ్యంలో మనం ఉన్నామా అని వారు తీవ్రంగా విమర్శించారు రానున్న కాలంలో ఈ ప్రభుత్వాలకు తగిన శాస్త్రి బుద్ధి చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సాయి కార్యదర్శి ఎండి మొయినుద్దీన్ చేవెళ్ల మండల సిపిఐ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి మొయినాబాద్ మండల కార్యదర్శి కే శ్రీనివాస్ మహిళా సంఘం నాయకురాలు అమృత మంజుల వినోద యాదమ్మ ధ్వంసం మల్లేష్ పరమయ్య నాని చంద్రయ్య