బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే కాలే యాదయ్యే

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
ఎమ్మెల్యే కాలే యాదయ్యే

* అందరం కాలే యాదయ్య గెలుపు కోసం పాటుపడాలి
* బీఆర్ఎస్ మండల మున్సిపాలిటీ పార్టీ నాయకులు

రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ బి ఆర్ ఎస్ పార్టీ అధిష్టానం చేవెళ్ల అసెంబ్లీ సీటుకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కేటాయించినందున మనమంతా కాలే యాదయ్య గెలుపు కోసం కృషి చేయాలని మండల, మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు గురువారం స్థానిక మణి గార్డెన్స్ లో విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలే యాదయ్య కొందరితో మాట్లాడకపోవడంతో పార్టీలో ఉంటూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం గెలుపు కోసం తామంతా కృషి చేశామని గుర్తు చేశారు. ఈనాడు పార్టీలోనే ఉండి కాలే యాదయ్యను విమర్శించడం విచారకరమైన అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, గ్రామాలు, మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన పనితనం చూసి సీఎం కేసీఆర్ మూడవసారి చేవెళ్ల టికెట్ కాలే యాదయ్యకు కేటాయించారని గుర్తు చేశారు. అందుకోసం అందరం ఆయన గెలుపు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కావలి గోపాల్, ఉపాధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌ డి చర్ల వెంకటేష్, మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాసుదేవ్ కన్నా, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, మాజీ చైర్మన్ రాజు నాయక్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, జనవాడ ఎంపీటీసీ నాగేందర్, పరివేద ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, మహారాజ్ పేట్ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి, కౌన్సిలర్లు చంద్రమౌళి, అశోక్, కో ఆప్షన్ సభ్యులు వెంకట్ రెడ్డి, మెహమూద్, నాయకులు ప్రవీణ్ కుమార్, జూలకంటి రామ్ రెడ్డి, చేకూర్త గోపాల్ రెడ్డి, బొల్లారం వెంకటరెడ్డి, బి. మధు, మునిసిపల్ యూత్ అధ్యక్షుడు జూలకంటి పాండురంగారెడ్డి, మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గౌ డి చెర్ల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.