బడుగుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి

బడుగుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి
* పర్వేద సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్
* ఘనంగా సర్దార్ పాపన్నగౌడ్ మహారాజ్ 373వ జయంతి

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని పర్వేద గ్రామంలో శుక్రవారం సర్వాయి పాపన్న జయంతి ఘనంగా జరిపారు. తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 373వ జయంతి సందర్భంగా గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ అనితా సురేందర్ గౌడ్ హాజరయ్యారు. సర్పంచ్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ప్రభుత్వం తరపున అధికారికంగా జరపాలని నిర్ణయించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. గౌడ కులానికి కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని అన్నారు. గీతా కార్మికులకు ప్రమాదవశాత్తు మరణిస్తే, వారికి భీమా సౌకర్యము కల్పింస్తున్నారు.అదే విధంగా గౌడ కుల సంఘానికి ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని,అన్ని కులాలతో పాటు ప్రభుత్వం గౌడ సంఘాలకు ఆదరిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్వేద సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి ఉప సర్పంచ్ ఎల్లయ్య, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు పెంటయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.