ప్రొద్దుటూరు బాలవికాస్ నీటి కేంద్రానికి ఉత్తమ వాటర్ ప్లాంట్ అవార్డు

ప్రొద్దుటూరు బాలవికాస్ నీటి కేంద్రానికి ఉత్తమ వాటర్ ప్లాంట్ అవార్డు

 

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో కొనసాగుతున్న బాలవికాస్ తాగునీటి కేంద్రానికి ఉత్తమ ఆపరేటర్, ఉత్తమ వాటర్ ప్లాంట్ అవార్డు లభించింది.

వరంగల్ పట్టణంలో గురువారం జరిగిన బాలవికాస్ తాగునీటి శుద్ధీకరణ పథకం కమిటీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 1,500 తాగునీటి కేంద్రాలకు గాను పొద్దుటూరు గ్రామ బాలవికాస్ త్రాగునీటి కేంద్రానికి ఈ అవార్డు దక్కింది.

ఈ సందర్భంగా బాలవికాస్ యాజమాన్యం మాట్లాడుతూ ప్రొద్దుటూరు గ్రామంలో ప్రజలకు శుద్ధమైన త్రాగునీటిని అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరు గ్రామంలో బాలవికాస్ తాగునీటి శుద్ధీకరణ పథకాన్ని పరిచయం చేసిన కోశాధికారి నాని బుచ్చయ్య, అవార్డు గ్రహీత ప్రొద్దుటూరు గ్రామానికి వన్నెతెచ్చిన ఆపరేటర్ శిరీషకు గ్రామ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.