ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలి

ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలి

* శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్

రచ్చబండ, శంకర్ పల్లి : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని శంకరపల్లి ఎంపీడీవో వెంకయ్యగౌడ్ సూచించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిందని తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులకు గ్రామపంచాయతీ కార్యదర్శులకు గ్రామ పరిపాలన పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

 

వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సమస్య, మురుగు కాలువల నిర్వహణ సమస్య, ఇంటి పన్ను వృత్తి పన్ను వసూలు చేసి గ్రామపంచాయతీకి ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను నిక్కచ్చిగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సురేందర్, ఉప తహసిల్దార్ ప్రియాంక, మండల పంచాయతీ అధికారి గీత, ఇరిగేషన్ డి ఈ పరమేష్, ఇరిగేషన్ ఎఈ రాధిక, వ్యవసాయ అధికారి సురేష్ బాబు, పంచాయతీరాజ్ ఏఈ యుగంధర్ మరియు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.