ప్రతి వాహనందారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
* చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సైదులు.. విద్యార్థులతో ర్యాలీ
రచ్చబండ, శంకర్ పల్లి: ప్రతి వాహనందారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని చేవెళ్ల సీఐ సైదులు తెలిపారు. బుధవారం ట్రాఫిక్ భద్రత వారోత్సవాలు సందర్భంగా శంకర్ పల్లి లోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరవకూడదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు తమ వాహనానికి ఇన్సూరెన్స్ టాక్స్, డాక్యుమెంట్ తోపాటు లైసెన్సు వాహనం వెంబడి ఉంచుకోవాలని తెలిపారు.
ఈ డాక్యుమెంట్స్ లేనియెడల ఇన్సూరెన్స్ వర్తించదని చెప్పారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. వారికి ఏమైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున రోడ్డు పడుతున్నాయని, వివరించాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహేశ్వర రావు, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.