పదేళ్లలో చేవెళ్లను అభివృద్ధిపథంలో ముందుంచా

పదేళ్లలో చేవెళ్లను అభువృద్ధి పధంలో ముందుంచా

* చేవెళ్ల ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి కాలే యాదయ్య.

 

రచ్చబండ, శంకర్ పల్లి: పదెండ్లలో చేవెళ్ల నియోజకవర్గం లోని గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని చేవెళ్ల ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు, టంగుటూరు, ఎల్వర్తి, చెందిప్ప, ఏరువా గూడా, కొత్తపల్లి, జనవాడ గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలోనే లేని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఒక అన్నల, ఓ తండ్రిలా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని కొనియాడారు.

 

అలాంటి ముఖ్యమంత్రిని మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు ఓటు వేస్తే శూన్యమని అన్నారు. పనులు చేసే ఎమ్మెల్యే కు ఓటు వేయాలని కోరారు. టంగుటూరు- మోకిలా గ్రామాల మధ్య మూసీ నదిపై 14 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మళ్లీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తే పెన్షన్లు 2000 నుండి 5వేలకు పెరుగుతాయని చెప్పారు. రైతుబంధు 12 వేల నుండి 16,000 వరకు పెంచబడుతుందని చెప్పారు.

 

స్థలం నుండి ఆర్థిక స్తోమత లేని పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 5 లక్షల భీమా సౌకర్యం కల్పించబడుతుందని చెప్పారు. మార్చి నుండి సందేశం బియ్యం రేషన్ షాపులలో సరఫరా అవుతాయని తెలిపారు. ఇంట్లో ఉండ నిస్సాయ మహిళలకు నెలకు 3000 రూపాయలు అందించడం జరుగుతున్నాయి చెప్పారు. 400 రూపాయలకే గ్యాస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య ఓటర్లను కోరారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, గుడిమల్కాపూర్ ఏఎంసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, మండల, మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, ఆయా గ్రామాల సర్పంచులు నరసింహారెడ్డి, గోపాల్, ఎలవర్తి ఉప సర్పంచ్ విక్రమ్ రెడ్డి, శాంతి చెన్నయ్య, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బొల్లారం వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్, గౌడిచర్ల లలిత నరసింహ, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌడ చర్ల వెంకటేష్, ఉపాధ్యక్షుడు రాఘవరెడ్డి, యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.