పటాన్ చెరుకు రాకపోకలు సులభం
* చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య
* ముసీపై మోకిలా- టంగుటూరు మధ్య ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల పరిశీలన
రచ్చబండ, శంకర్ పల్లి; శంకర్ పల్లి మండలంలోని మోకిలా- టంగుటూరు గ్రామాల మధ్య మూసీ నదిపై నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జ్ పనులను మంగళవారం చేవెళ్ల ఎంపీ. డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 12 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని తెలిపారు. బ్రిడ్జి పనులు పూర్తయితే చేవెళ్ల నుండి పఠాన్ చెరువు వరకు రాకపోకలు సులభంగా కొనసాగించుకోవచ్చని అన్నారు. రైతులకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
మండలంలోని గోపులారం వద్ద మరో బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని చెప్పారు. మొయినాబాద్ మండలం చిన్న మంగళారం గ్రామాల ప్రజలకు ఈ బ్రిడ్జ్ ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టని ఈ బ్రిడ్జి పనులను సీఎం కేసీఆర్ చేపట్టి గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులువుగా కొనసాగడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మూసీ నది పై గంగాడ- గొల్లగూడాల మధ్య ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో టంగుటూరు గ్రామ సర్పంచ్ గోపాల్, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, మోకిలా ఏఎంసి చైర్మన్ గోపాల్, శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.