valmiki foundation.. విద్యార్థులకు వాల్మీకి ఫౌండేషన్ మరోసాయం

రచ్చబండ, శంకర్ పల్లి : గురు పౌర్ణమిని పురస్కరించుకొని విద్యార్థులకు వాల్మీకి ఫౌండేషన్ మరో సాయం అందజేసింది. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్, పిల్లిగుండ్ల ప్రైమరీ స్కూల్, కొండకల్ తండాలో చదువుకుంటున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్, ఫౌండేషన్ సభ్యులు నాయుడు, చిన్న కలిసి విద్యార్థులకు వాటిని అందజేశారు.

ఈ సందర్భంగా మర్పల్లి అశోక్ మాట్లాడుతూ బాధ్యతగల ఒక గురువుగా, వాల్మీకి ఫౌండేషన్ సహకారంతో మండలంలోని ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, సైకిళ్లు, స్పోర్ట్స్ కిట్స్ ను అందించడం జరుగుతుందని తెలిపారు. ఇవి విద్యార్థుల చదువుకు దోహదపడి, విద్యార్థులు మధ్యలో బడి మానేయకుండా క్రమంగా పాఠశాలకు రావడానికి ఉపయోగపడతాయని చెప్పారు.

ఆర్థికంగా ఇబ్బంది పడే తల్లిదండ్రులకు కొంత ఊరటగా ఉంటుందని భావించి వాల్మీకి ఫౌండేషన్ ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. దాతలు అందజేసిన స్టడీ మెటీరియల్ ను విద్యార్థులు  సద్వినియోగం చేసుకొని చదువు పట్ల అంకితభావంతో ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగయ్య, పిల్లిగుండ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలమణి, కొండకల్ తాండ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.