పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.

రచ్చబండ, శంకర్ పల్లి: బోనాల పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపురంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ దైవచింతన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జూలకంటి లక్ష్మమ్మ రాంరెడ్డి. శ్వేత పాండురంగారెడ్డి, గోపాల్, రామ్ రెడ్డి, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జూలకంటి పాండురంగారెడ్డి, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.