శంకర్ పల్లిలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ

రచ్చబండ, శంకర్ పల్లి; ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా మంగళవారం శంకర్ పల్లి ప్రాథమిక దవాఖాన సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా అరికట్టడానికి పరిమిత కుటుంబమే లక్ష్యంగా ఉండాలని ఆయన అన్నారు.

ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగి కుటుంబాలు ఉండాలన్నారు. వివాహ వయస్సు వచ్చేవరకు పెళ్లిళ్లు చేయరాదని తెలిపారు. చిన్న కుటుంబం ఉంటే చింత లేకుండా ఆ కుటుంబం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రేవతి, డిప్యూటీ చైర్మన్ కార్యాలయం సంతోష, సుదర్శన్ ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.