నేడు శంకర్ పల్లిలో పార్క్, ఓపెన్ జిమ్ ప్రారంభించనున్న ఎంపీ రంజిత్ రెడ్డి
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని వివేకానంద కాలనీ లో రామకృష్ణ విద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పార్కు, ఓపెన్ జిమ్ లను శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్. విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీపీ, జడ్పిటిసి, మార్కెట్ కమిటీ చైర్మన్, పిఎసిఎస్ చైర్మన్, మండల రైతు సమన్వయ సమితి నాయకులు, గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, హాజరుకావాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రకటనలో కోరారు.