నేడు భాగ్యనరంలో వీర హనుమాన్ విజయ యాత్ర

నేడు భాగ్యనరంలో వీర హనుమాన్ విజయ యాత్ర

* హైదరాబద్ లోని గౌలిగూడ హనుమాన్ మందిర్ లో యజ్ఞం

* వీహెచ్పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వైభవంగా హనుమాన్ జయంతి

* విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

రచ్చబండ, హైదరాబద్ : హైదరాబద్ మహా నగరంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకులను వీహెచ్పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిచనున్నట్లు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం శ్రీ హనుమాన్ జయంతి సందర్బంగా నిర్వహించే యాత్రలో హిందూ యువ సైనికులు లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

యాత్రలో భాగంగా ఉదయం 8:30 గంటలకు గౌలిగూడ హనుమాన్ మందిర్ లో యజ్ఞం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పూజల అనంతరం ఉదయం 10 గంటలకు వీర హనుమాన్ విజయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. రామభక్తులు, హిందూ యువ సైనికులు హిందూ శక్తి జాగరణ యాత్రలో పాల్గొంటారని తెలిపారు. వీర హనుమాన్ యాత్ర యథావిధిగానే ప్రతి సంవత్సరం సాగే దారిలోని దాదాపు 13 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని తెలిపారు.

గౌలిగూడ హనుమాన్ మందిర్ దగ్గర ప్రారంభమై, కోటి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా, కాచిగూడ వీరసావర్కర్ చౌరస్తా, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, మారియాట్ హోటల్, బైబిల్ హౌస్, మహంకాళి మందిర్, ప్యారడైజ్ మీదుగా తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.

హనుమాన్ యాత్రకు ముఖ్య వక్తగా విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బాధ్యుడు శ్రీ గోపాల్ జి అయోధ్య నుంచి వచ్చి హాజరవుతారని తెలిపారు.