నిర్భీతికి కవి కాళోజీ నిదర్శనం
* శంకర్ పల్లి మునిసిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్
రచ్చబండ, శంకర్ పల్లి: నిర్భీతికి కవి కాళోజీ నారాయణరావు నిదర్శనమని శంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కొనియాడారు. కాళోజి జయంతిని పురస్కరించుకొని శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాళోజీ అణువణువునా తెలంగాణ పదం పలికించి ప్రజా బహుళయాన్ని జాగ్రత్తపరిచిన వైతాళికుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.