నిరుపేద కుటుంబానికి కొండకల్ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి ఆర్థికసాయం
రచ్చబండ, శంకర్ పల్లి: ఇటీవల శంకర్ పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో అకాల మృతి చెందిన ఎండీ కాలేజ్ కుటుంబానికి ఆ గ్రామ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని బుధవారం కాలేజ్ భార్య సాజిదా బేగంనకు అందించారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఈ కుటుంబం కొండకల్ గ్రామానికి బతుకుదెరువుకై వచ్చిందని తెలిపారు. సాజిదా బేగంకు ఐదుగురు కూతుళ్లు ఉన్నారని తెలిపారు. వారికి సొంత ఇల్లు లేదని చెప్పారు.
జిల్లా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య దృష్టికి తీసుకెళ్లి ఈ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేస్తూ, పింఛన్ సదుపాయం కల్పించాలని కోరుతామన్నారు.