దేశ సమ్మైక్యతకు ప్రతీక గణేష్ నవరాత్రులు

దేశ సమ్మైక్యతకు ప్రతీక గణేష్ నవరాత్రులు

* మహాలింగాపురం గ్రామ ప్రధానోపాధ్యాయుడు తాహెర్ అలీ
* వేలంలో రూ.23,100కు గణేశ్ లడ్డూ కైవసం

రచ్చబండ, శంకర్ పల్లి: దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రతీక అయిన వినాయక చవితి పండుగ అని మహాలింగాపురం గ్రామ ముస్లింలు, మహారాజ్ పేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండి తాహెర్ అలీ అన్నారు.

శుక్రవారం మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద గణేష్ లడ్డూ ప్రసాదాన్ని తాహిర్ అలీ వేలంపాట లో పాల్గొని రూ.23,100కు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలపై వినాయకుని కృప ఎల్లప్పుడూ ఉండాలని, కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఆయురారోగ్యాలతో భారత దేశం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి టి యు టిఎఫ్ అధ్యక్షులు ఎండి. మునీర్ పాషా వినాయక మంటప సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.