తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై గాంధీ కుటుంబం ఎలాంటి ఫీలింగ్ లో ఉంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ అధినాయకత్వం.. తమ పార్టీ నేతల పైనా అంతే కినుకుతో ఉన్నట్లుగా తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెబుతున్నారు. తాజాగా ఆయన్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మధు యాష్కీ భేటీ అయ్యారు. కర్ణాటక పీసీసీకి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపేందుకు రాహుల్ ను.. మధుయాష్కీ కలిశారు.