టీపీసీసీ నేత విజయ కుమార్ ను కలిసిన కాడిగారి రాజశేఖర్ రెడ్డి
రచ్చబండ, శంకర్ పల్లి: టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ ను శనివారం హైదరాబాద్ లోని అయన నివాసంలో శంకర్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రచార కమిటీ మెంబర్ విజయకుమార్ మాట్లాడుతూ ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేసే తమ ప్రాంత బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లోల్ల శ్రీకాంత్, మర్రి రామ్ రెడ్డి, అంతారం రవీందర్ పాల్గొన్నారు.