చేవెళ్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

చేవెళ్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
– బీజేపీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి

రచ్చబండ, శంకర్ పల్లి: చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచక పాలన అంతం చేయడానికి యువత నడుం బిగించాలని కోరారు.

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న పథకాలను బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు ఇంటింటికి వివరించాలని కోరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యాలను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు కేటాయించకుండా ఇతరులకు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని, దళిత బంధు టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వడం సరైనది కాదని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య డబుల్ బెడ్ రూమ్ కేటాయించడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించారు. చేవెళ్లలో అసెంబ్లీ స్థానానికి నిలబడుతున్న అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పేర్కొన్నారు.